
అక్కడ ట్యాటు తొలగించిన సమంత
హీరోయిన్‌గా స్టార్‌డమ్ అందుకున్న సమంత ఇప్పుడు నిర్మాతగా మారింది. ఇటీవలే శుభం అనే సినిమా చేసింది. ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. తక్కువ సమయంలో స్టార్ హీరోయిన్‌గా మారిపోయిన సమంత.. టాలీవుడ్‌లో దాదాపు అందరు స్టార్ హీరోలతో నటించారు. సమంత అందానికి, నటనకు ఫిదా కానీ కుర్రాడు ఉండడు. కాగా, త్వరలోనే సమంత హీరోయిన్‌గా బిజీ కానుంది. ఇదిలా ఉంటే తాజాగా సమంతకు సంబంధించిన ఓ వీడియో వైరల్ అవుతోంది. ఆ వీడియోలో సమంత మెడపై టాటూ కనిపించకపోవడంతో నెటిజన్స్ షాక్ అవుతున్నారు. సమంత టాటూ కనిపించకపోవడంతో భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. సమంత టాటూ తొలగించిందని కొంతమంది. లేదు మేకప్ తో కవర్ చేసిందని మరికొంతమంది అంటున్నారు.
