• అప్పుడు కాంగ్రెస్‌.. ఇప్పుడు బిఆర్‌ఎస్‌
    తిరగబడిన పదేళ్ల క్రితం నాటి పరిస్థితులు
    బండ్లు ఓడలు, ఓడలు బండ్లు అవుతాయంటే ఇదేనేమో! పదేళ్ల క్రితం తెలంగాణ కాంగ్రెస్‌ ఎదుర్కొన్న పరిస్థితులు.. ఇప్పుడు బిఆర్‌ఎస్‌ అనుభవిస్తోంది. తెలంగాణ ఇచ్చిన పార్టీ కంటే తెలంగాణ తెచ్చిన పార్టీగా ఆనాడు ఓటర్లు బిఆర్‌ఎస్‌ను ఆదరించారు. బిఆర్‌ఎస్‌కు అసెంబ్లీలో మెజారిటీ సీట్లు ఉన్నా.. కాంగ్రెస్‌ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలను చేర్చుకున్నారు. ఇప్పుడు కాంగ్రెస్‌ కూడా అదే చేసింది. 2014 ఎన్నికల తర్వాత కాంగ్రెస్‌ గడ్డు పరిస్థితుల్లోకి వెళ్లిపోయింది. సీనియర్‌ నాయకులు ఉన్నా.. పార్టీ వైభవం వెలవెలబోయింది. ఒకానొక దశలో కాంగ్రెస్‌ లేకుండా పోతుందేమోనన్న పరిస్థితులు కనిపించాయి. ఇప్పుడు బిఆర్‌ఎస్‌ ఇంకా విభిన్న పరిస్థితులను ఎదుర్కోవాల్సి వస్తుంది. పార్టీ అధినేతతోపాటు ద్వితీయ శ్రేణి నాయకత్వం అవినీతి ఆరోపణల్లో చిక్కుకోవడం, అధినేత కూతురే తిరుగుబాటు చేయడం పెద్ద పరీక్షగా మారింది.