ముందే వచ్చిన వాన మబ్బులు ఎటుపోయినట్టు!
ఈ సారి ఫుల్ వర్షాలు.. రుతుపవనాలు కూడా ముందే వస్తున్నాయి. కేరళ దాటాయి. ఏపీలోకి వచ్చాయంటూ జోరుగా ప్రచారం జరిగింది. కానీ, ఇప్పటివరకు ముంబై, హైదరాబాద్ నగరాలకే పరిమితమైన వానలు.. గ్రామీణ ప్రాంతాల్లో ముఖం చాటేశాయి. ఒకటీ, రెండు వానలు అక్కడక్కడ పడినా.. నేల తడిచేంతగా ఒక్క వాన పడలేదు. దీంతో రైతులు ఆకాశంకేసి చూడాల్సిన పరిస్థితులు ఏర్పడనున్నాయా అనే అనుమానాలు కలుగుతున్నాయి. అసలు ముందే వచ్చిన రుతుపవనాలు ఎటు వెళ్లినట్లు అనే సందేహాలు రేకెత్తుతున్నాయి. మరో రెండు, మూడు రోజుల్లో వానలు పడకపోతే.. రైతుల్లో దిగులు పెరుగుతుంది. – నమస్తే.