• కలియుగ కౌరవులు! లంచావతారులు?
    త్రేతా యుగంలో కాంత కాంక్షతో ఒకరి సంహారం జరిగింది. ద్వాపర యుగంలో రాజ్యకాంక్షతో కౌరవసేన కనుమరుగైంది. ప్రస్తుతం కలియుగం.. ధనకాంక్ష రాజ్యమేలుతోంది. సంపాదన ఒకటే మార్గంగా అవినీతి, అక్రమాలు పెచ్చుమీరుతున్నాయి. ప్రభుత్వ ఉద్యోగులు పలువురు లంచావతారులుగా మారి పరిపాలనను భ్రష్టుపట్టిస్తున్నారు. వేలకు వేలు వేతనాలు తీసుకుంటూ అక్రమ సంపాదనకు అలవాటుపడి అన్యాయానికి ఒడిగడుతున్నారు. పాలకులు సైతం ధనకాంక్షకు దాసోహమై నయవంఛనకు పాల్పడుతున్నారు. ప్రజలు కూడా ఒకరికొకరు మోసం చేసుకోవడానికి ఏమాత్రం వెనుకాడడం లేదు. వీటన్నింటి వెనుక అందరి కాంక్ష ఒక్కటే ధనం. డబ్బు కోసం ఎంతటి నీచానికైనా ఒడిగడుతున్నారు. ఇక ఈ దుష్టశక్తి నుంచి శిష్టరక్షణ గావించే అవతారమూర్తి ఎప్పుడు ఉద్భవిస్తాడో మరి! ఈ కలియుగ కౌరవులుగా రాజ్యమేలుతున్న వీరికి తగిన శాస్తి జరిగేదెప్పుడో?

 – నమస్తే