• చిన్నప్పుడు బారసాల..
    పెద్దయ్యాక ‘బార్‌’శాల!
    బారసాల.. ఒక రకంగా పుట్టినరోజు వేడుక అని చెప్పొచ్చు. ప్రతీ వ్యక్తికి పుట్టిన 21వ రోజున బారసాల చేస్తుంటారు. ఆ రోజు శిశువుకు పేరు పెడతారు. అలాగే.. పిల్లలను ఊయలలో వేసి, బంధువులు, స్నేహితులు వచ్చి ఆశీర్వదించి, బహుమతులు ఇస్తారు. ఇది ప్రతి వ్యక్తి జీవితంలో జరిగే తొలి సంబరం. ఇక పుట్టినరోజు వేడుకలు ఏటా జరుగుతుంటాయి. ఇది మామూలే. అయితే, వేడుకల నిర్వహణలోనే మార్పులు చేటుచేసుకుంటాయి. సదరు వ్యక్తి వయసు పెరుగుతున్న కొద్దీ పుట్టినరోజు సంబరాలు జరిగే స్టైలే మారిపోతుంది. చిన్నప్పుడు బారసాలగా పిలిచే ఈ వేడుక.. తర్వాత కాలంలో ‘బార్‌’(మద్యం దుకాణాలు)లకు మారుతుంది. ఊయలలో వేసి అందరూ ఊపితే.. ఇక్కడ మందేసి తనంతట తానే ఊగిపోతాడు. చిన్నప్పుడు పేరు పెట్టడం మినహాయిస్తే.. ఊగడం, స్నేహితులు, బంధువులు ఆశీర్వదించడం, బహుమతులు ఇవ్వడం అంతా సేమ్‌ టు సేమ్‌. కాకపోతే.. వేదిక మారుతుంది అంతే. ఇదీ మానవుడు ఎదుగుతున్న కొద్దీ సంస్కృతీ సంప్రదాయాలు, ఆచార వ్యవహారాలను పాటించి, పరిరక్షించే వ్యవహారానికి ఓ నిదర్శనం.
    – నమస్తే.