
జూన్.. ఖర్చుల జోన్!
- పెట్టుబడుల మాసం వచ్చేస్తోంది
- సాగుబడి, చదువుల ఒడి ఖర్చులే ఖర్చులు
వానమబ్బులు వచ్చేస్తున్నాయి. డబ్బు సంచులు సిద్ధం చేసుకోండి. జూన్ మాసం వచ్చేస్తోంది. చదువులకు చదివింపులు దగ్గర పెట్టుకోండి. పెట్టుబడులు పెట్టేందుకు అప్పోసప్పో చేయండి.
పెట్టుబడుల సీజన్ మరికొద్ది రోజుల్లో ప్రారంభం కానుంది. ఈసారి వర్షాలు ముందుగానే వస్తాయని వాతావరణ శాఖ పదిహేను రోజులుగా అప్రమత్తం చేస్తోంది. రైతులు కూడా సాగుబడికి సిద్ధమవుతున్నారు. మరోపక్క జూన్ 12వ తేదీ నుంచి విద్యాసంస్థలు తెరుచుకోనున్నాయి. ఇంకేముంది పెట్టుబడుల కోసం రైతులు, తల్లిదండ్రుల్లో ఆరాటం ఆరంభమైనట్లే. విత్తనాలు, ఎరువులు, కూలీల ఖర్చులు.. పుస్తకాలు, పెన్నులు, బూట్లు, బ్యాగులు, బట్టలు, ఫీజులు.. పెద్దమొత్తంలో ధనలక్ష్మీ చేతులు మారనుంది. విత్తనాలు, ఎరువుల షాపులు, పుస్తకాలు, బట్టలు, చెప్పుల దుకాణాలు కళకళ లాడనున్నాయి. కోట్లలో జరిగే వ్యాపారానికి జూన్ నెల అప్పుల జోన్‌గా మారనుంది.
