తీసుకుంటే లంచగొండి! ఇస్తే..?
లంచం.. ప్రస్తుతం సమాజంలో కొనసాగుతున్న అతిపెద్ద ధనమార్పిడి వ్యవస్థ ఇదేనేమో! దేశవ్యాప్తంగా కొన్ని కోట్లలోనే ఈ వ్యవహారం సాగుతున్నదేమో! అయితే.. లంచం తీసుకునే వారిని లంచగొండి అంటాం.. మరి ఇచ్చేవారిని ఏమనాలి..? ఇప్పటివరకు ఆ సందర్భం రాలేదు. లంచం పుట్టినప్పటి నుంచి తీసుకునే వారే పట్టుబడ్డారు. పట్టుకునేలా చేశారు. కానీ, ఇప్పటివరకు లంచం ఇచ్చిన వారు దొరికిన సందర్భాలు అసలు లేవు కావచ్చు. ఒక విధంగా లంచం తీసుకునే వారే కాదు, ఇచ్చేవారు కూడా నేరస్తులే అంటుంటారు. అయితే, ఒక్కరూ దొరకరు. అధికారుల్లో అందరూ లంచం తీసుకునే వారు ఉండరని అంటారు. మరి.. అలాంటి వారు లంచం ఇచ్చేవారిని చట్టానికి పట్టించే సాహసం ఎందుకు చేయడం లేదో? ఒకవేళ అలాంటి సందర్భమే వస్తే ఏసీబీ అధికారులు వారిని ఎలా పట్టుకుంటారు? బహుశా అలాంటి సందర్భం వారికి రాదేమో? -నమస్తే.