• నర్సంపేటలో సార్‌ స్టాచ్యూ!
    తెలంగాణ జాతిపిత జయశంకర్‌ విగ్రహం ఏర్పాటుకు కసరత్తు
    రూ.10వేలు విరాళం అందజేసిన తాటికొండ మల్లేశం
    వరంగల్‌ జిల్లా నర్సంపేట పట్టణంలో తెలంగాణ జాతిపిత ఆచార్య కొత్తపల్లి జయశంకర్‌ సార్‌ విగ్రహం ఏర్పాటుకు కసరత్తు జరుగుతోంది. పట్టణంలోని వల్లభ్‌నగర్‌ వీరబ్రహ్మేంద్రస్వామి దేవాలయం ఆర్చ్‌ వద్ద ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. స్థానిక విశ్వకర్మ ట్రస్ట్‌ ఆధ్వర్యంలో కాంస్య విగ్రహం నెలకొల్పనున్నారు. అందుకు గీసుకొండ వాస్తవ్యులు తాటికొండ మల్లేశం రూ.10వేలు విరాళం ప్రకటించారు. ఆ మొత్తాన్ని నర్సంపేట విశ్వకర్మ ట్రస్ట్‌ చైర్మన్‌ కురిమిళ్ళ సుదర్శనాచారి, సభ్యులు మొగులోజు కోటిలింగాచారి, పబ్బోజు సత్యనారాయణ, కుదరుపాక జగదీశ్వర్‌కు అందించారు. కార్యక్రమంలో ప్రొఫెసర్‌ జయశంకర్‌ సేవాసమితి రాష్ట్ర అధ్యక్షుడు డా.శంకరభక్తుల సత్యం, అధికార ప్రతినిధి కర్ణకంటి రాంమూర్తి పాల్గొన్నారు.