పత్తికి ఎక్కిన పైసల్! మద్దతు ధర రూ.589పెంపు కేంద్ర ప్రభుత్వం నిర్ణయం వరిపై రూ.69 పెంపు
పత్తి రైతులకు ఈ సారి పండినంత సిరుల పంటే. పత్తి మద్దతు ధరను పెంచుతూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 2025-26 ఖరీఫ్ సీజన్‌కు 14 రకాల పంటల మద్దతు ధరను కేంద్రం పెంచింది. క్వింటా పత్తికి రూ.589 పెంచింది. ఇక వరికి రూ.69 పెంచింది. దీంతో వరి క్వింటా ఈ ఏడాది రూ.2,369 రూపాయలు పలకనుంది. ఇక జొన్నలు రూ. 328, సజ్జలు రూ.150Ñ రాగులు రూ.596, మొక్కజొన్న రూ.175, కందిపప్పు రూ.450, పెసర రూ.86, మినుములు రూ.400, వేరుశెనగ రూ.480, పొద్దుతిరుగుడు రూ.441, సోయాబీన్ రూ.436, కుసుమలు రూ.579, వలిశలు (గడ్డినువ్వులు) రూ.820, పత్తి రూ.589 చొప్పున కనీస మద్దతు ధరను పెంచారు.