• ఉద్యోగినుల భర్తలు పెత్తనం చలాయిస్తే తప్పేంటి?
  • సరం్పచ్ లు, ఎంపీటీసీల భర్తలే కొమ్ములు తిరిగిన వారా?
  • ప్రజాప్రతినిధులకు ఓ న్యాయం? అధికారిణులకు మరో న్యాయమా?
  • మహిళా సర్పంచ్లు చేసేదేమిటి? ఉద్యోగినులు చేయనిదేమిటీ?
  • ఇద్దరు సంతకాలకే పరిమితం కదా?
    ప్రస్తుతం పంచాయతీ ఎన్నికలు జరుగుతున్నాయి. రిజర్వేషన్లు, ఇతర అవకాశాలను బట్టి మహిళలు, పురుషులు వివిధ స్థానాల నుంచి బరిలో నిలిచారు. వీరిలో కొందరు మహిళలు, మరికొందరు పురుషులు తప్పకుండా విజయం సాధిస్తారు. అయితే, మహిళలు గెలిచిన చోట వారి భర్తలో లేదా ఇతర కుటుంబసభ్యులో పెత్తనం చలాయిస్తారనేది తెలియంది కాదు. అప్పటివరకు ఆమె పేరుకు లేని తోకలు.. ఉన్నట్టుండి భర్తల పేర్లు తగులుకుంటాయి. ఒక సర్వసభ్య సమావేశాలకు తప్పు.. అన్ని చోట్ల మహిళ ప్రజాప్రతినిధుల భర్తలే కనిపించడం కూడా అందరికీ తెలిసిందే. ఈ విషయాన్ని అంతగా ఎవరూ పట్టించుకునే వారు లేరనేది జగమెరిగిన సత్యమే. అయితే, వీరిలాగే మహిళా ఉద్యోగినుల భర్తలో, కుటుంబసభ్యులో పురుషులో పెత్తనం చలాయించడానికి ఎందుకు అవకాశం ఉండదో అర్థం కాని పరిస్థితి. ఉద్యోగ రీత్యా మహిళలు.. క్షేత్రస్థాయిలో పర్యటిస్తుంటారు. మహిళా సర్పంచ్లు, ఎంపీటీసీల భర్తల్లాగా, మహిలా ఉద్యోగినుల భర్తలకు కూడా క్షేత్రస్థాయిలో పర్యటిస్తే తప్పేంటి? చివరకు కాగితాల మీద సంతకాలు పెట్టేది మహిళ ఉద్యోగినులు, ప్రజాప్రతినిధులే కదా! ప్రజాస్వామ్యంలో మహిళా ఉద్యోగినులకు, మహిళ ప్రజాప్రతినిధులకు మధ్య ఈ వివక్ష ఎందుకో? మరి! సర్పంచ్లు, ఎంపీటీసీల భర్తలకు ఏమైనా కొమ్ములు ఉన్నాయా? లేదంటే మహిళలను వంటింటి కుందేళ్లుగానే భావిస్తున్నారు. ఒకపక్క మహిళలను కోటీశ్వరులను చేస్తామని ప్రకటిస్తున్న ప్రభుత్వం ఈ వివక్షపై దృష్టి సారించాలి. లేదంటే.. మహిళా ఉద్యోగినుల భర్తలకు కూడా పెత్తనం చలాయించే అవకాశం అధికారికంగా అమలు చేయాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *