మరో ముగ్గురికి మరోసారి అవకాశం
ఎప్పుడెప్పుడా? అని ఆశావహులను ఊరిస్తున్న తెలంగాణ కేబినెట్ విస్తరణకు ఎట్టకేలకు ముహూర్తం కుదిరింది. ఆదివారం కేబినెట్ విస్తరణకు హైకమాండ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. శనివారం సాయంత్రం రాజ్ భవన్ నుంచి అధికార ప్రకటన వెలువడనుంది. మంత్రివర్గ విస్తరణలో ఆరు ఖాళీలు ఉన్నప్పటికి కొత్తగా ముగ్గురికి చోటు కల్పిస్తారని మరికొంత కాలం తర్వాత మరో ముగ్గురికి అవకాశం ఇస్తారని తెలుస్తోంది. ఐతే ఈ మంత్రివర్గ విస్తరణలో చోటు దక్కించుకోనున్న ఆ ముగ్గురు ఎవరన్న దానిపై ఆసక్తికర చర్చసాగుతోంది.
మంత్రి పదవుల రేసులో ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్యేలు ఓ వైపు, మాదిగ సామాజిక వర్గం, లంబాడ, ముదిరాజ్ సామాజిక వర్గం ఎమ్మెల్యేలు మరోవైపు.. ఎవరికి వారు గట్టి ప్రయత్నాలే చేశారు. మంత్రి పదవులను ఆశిస్తున్న మల్ రెడ్డి రంగారెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, సుదర్శన్ రెడ్డి, ప్రేమ్ సాగర్ రావు, వాకిటి శ్రీహరి ముదిరాజ్,గడ్డం వివేక్,ఆది శ్రీనివాస్ ఎమ్మెల్సీలు విజయశాంతి, అద్దంకి దయాకర్, అమేర్ అలిఖాన్ లలో ఎవరికి మంత్రివర్గ విస్తరణలో చాన్స్ దక్కనుందన్న అంశం రేపటితో తేలిపోనుంది. – నమస్తే