కోర్టు ఆవరణలో మొక్కలు నాటింపు నర్సంపేట- కొత్తపేపర్ ప్రతినిధి :
నర్సంపేటలోని కోర్ట్ ఆవరణలో గురువారం పర్యావరణ దినోత్సవం సందర్భంగా న్యాయ సేవా సంస్థ ఆధ్వర్యంలో మండల న్యాయ సేవా సంస్థ చైర్మన్, సబ్ జడ్జి డి.వరూధిని అధ్యక్షతన కోర్టు ఆవరణలో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా జడ్జి వరూధిని మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణకు ప్రతిఒక్కరూ కృషి చేయాలన్నారు. అందరూ విధిగా మొక్కలు నాటాలని సూచించారు. పర్యావరణ సమతుల్యతను కాపాడేది మొక్కలేనని ప్రకృతి బాగున్నప్పుడే సమాజానికి మేలు జరుగుతుందని పేర్కొన్నారు. సమాజ శ్రేయస్సు ప్రతి ఒక్కరు తమ ఇళ్లలో మొక్కలు పెంచుకోవాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో నర్సంపేట న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు కే.సంజయ్ కుమార్, కార్యదర్శి మోటురి రవి, న్యాయవాదులు దాసి రమేష్ , పుట్టపాక రవి, టి.సునీత, కోర్టు సిబ్బంది పాల్గొన్నారు.