
- రైతుల లైన్ కాదు! రేషన్ బియ్యం లైన్!!
మూడు నెలల బియ్యం ఇస్తుండడంతో రేషన్ షాపుల వద్ద రద్దీ!
కచ్చితంగా ఈ సీజన్‌లో ఏ షాపు ముందు సంచులు, చెప్పుల వరస కనపడినా రైతులని ఠపీమని చెప్పొచ్చు. కానీ, ఈ సారి రైతులకంటే ముందు రేషన్ లబ్ధిదారులు ఆ ఛాన్స్ కొట్టేశారు. మూడు నెలల బియ్యం ఒకేసారి ఇస్తుండడంతో లబ్ధిదారులు కంట్రోల్ దుకాణాల ముందు బారులు తీరాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. ఒక్కో లబ్ధిదారుడు ఆరు సంతకాలు చేయాల్సి వస్తుండడంతో బియ్యం పంపిణీలో కూడా జాప్యం చోటుచేసుకుం టోంది. దీంతో చౌకధరల షాపుల వద్ద జనం బారులు తీరి కనిపిస్తున్నారు. కొన్ని చోట్ల సర్వర్ సమస్యలు కూడా బియ్యం పంపిణీకి అవరోధాలు కలుగుతున్నాయి. అదీగాక, మూడు నెలల వరకు మళ్లీ బియ్యం వచ్చే అవకాశం లేకపోవడం, ఈ సారి తీసుకోకపోతే కార్డులు రద్దు అవుతాయనే అనుమానంతో అందరూ రేషన్ షాపులకు పరుగులు తీస్తున్నట్లు తెలుస్తోంది.
– నమస్తే
