
రైలు ఫ్రీ అంటే రాహుల్ ప్రధాని అయ్యేవాడేమో?!
కాంగ్రెస్ పార్టీ గత ఎన్నికల్లో తెలంగాణలో అధికారంలోకి రావడానికి పలు హామీలు ఇచ్చింది. ఆరుగ్యారంటీల పేరిట మేనిఫెస్టోను విడుదల చేసింది. వందరోజుల్లో అమలు చేస్తామంటూ సభలు పెట్టి గొంతుచించుకుంది. ఇక ఆరు గ్యారంటీల్లో ఎన్ని అమలవుతున్నాయని పక్కన పెడితే.. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం హామీ అతివలను బాగా ఆకర్శించిందనే చెప్పాలి. రేవంత్‌రెడ్డి ముఖ్యమంత్రి కావడంలో ఈ హామీ కీలక మంత్రంగా పనిచేసిందనే చెప్పుకోవాలి. అయితే, దేశంలో కూడా ఈసారి కాంగ్రెస్ గెలిచితీరుతుందని ఆ పార్టీ నాయకులు భావించారు. ఆ పార్టీ అగ్రనేత రాహుల్‌గాంధీ దేశవ్యాప్తంగా చేపట్టిన జోడోయాత్ర.. విజయాన్ని తెచ్చిపెడుతుందని అనుకున్నారు. కానీ, అది ఫలించలేదు. మేనిఫెస్టో కూడా ప్రజలను ఆకట్టుకోలేకపోయింది. అయితే.. కర్ణాటక, తెలంగాణలో ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం హామీలా.. దేశంలో మహిళలందరికీ రైలు ప్రయాణం ఉచితమంటే.. మెజారిటీ సీట్లు గెలుచుకునేదేమో? రాహుల్‌గాంధీ ప్రధాని అయ్యేవాడేమో? ఇంకా విమాన ప్రయాణం ఉచితమంటే మాత్రం కాంగ్రెస్ పార్టీ గాలిలో గెలిచితీరుతుందేమో!
– జి.నమస్తే.
