• 30మీటర్లు.. 3 లీకులు
    వరంగల్‌ పోచమ్మమైదాన్‌ కూడలి నుంచి దేశాయిపేట వెళ్లే మార్గంలో 30 మీటర్లలోపే మూడు గుంతలు ముప్పుతిప్పలు పెడుతున్నాయి. ఈ రోడ్డు కింద మంచినీటి పైపులైన్‌ ఉన్నట్టుంది. తరచూ పైపులైన్‌కు లీకేజీ ఏర్పడుతుంది. ఇంకేముంది.. రోడ్డు కింద గంగ.. రోడ్డు మీద బుంగలా తయారైంది ఈ మార్గం దుస్థితి. వరంగల్‌ మహానగర పాలక సంస్థ పాలనాధీశులు రిపేరు చేసినా.. మూణ్నెళ్లకే మళ్లీ లీకేజీలు ఏర్పడుతున్నాయి. రిపేరు సమయంలో రోడ్డును తవ్వడం.. మట్టితో పూడ్చడం.. మళ్లీ లేకేజీలతో ఉబికివచ్చే నీటితో గుంతలు ఏర్పడుతున్నాయి. ఈ గుంతలకు తోడు ఆటోల అడ్డా, బార్‌షాప్‌ పార్కింగ్‌ వాహనాలతో ప్రయాణికులు ఈ కూడలి దాటాలంటే.. పద్మవ్యూహంలో చిక్కుకున్నంత పని అవుతోంది. ఇదే మార్గం గుండా దేశాయిపేట, ఆటోనగర్‌, డీఎంహెచ్‌వో కార్యాలయం వెళ్లేవారు నరకయాతన అనుభవిస్తున్నారు. దటీజ్‌ గ్రేటర్‌ వరంగల్‌ బల్దియా .. గ్రేట్‌, గ్రేటస్య:, గ్రేటోభ్య:!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *