• వీవర్స్‌ ట్రస్ట్‌ ఆధ్వర్యంలో తెలంగాణ వేడుకలు
    ది వీవర్స్‌ వెల్ఫేర్‌ ట్రస్ట్‌ బోర్డు భవన్‌ ప్రాంగణంలో సోమవారం తెలంగాణ అవిర్బావ వేడుకలు ఘనంగా జరిగాయి. ట్రస్ట్‌ చైర్మన్‌, వర్ధన్నపేట మాజీ ఎమ్మెల్యే వన్నాల శ్రీరాములు మువ్వన్నెల జెండాను ఎగురవేశారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్‌ కోశాధికారి గజ్జెళ్ళి రవిందర్‌, తెలంగాణ ఆన్‌ లైన్‌ మీడియా వర్కింగ్‌ జర్నలిస్టుల అసోసియేషన్‌ రాష్ట్ర కోశాధికారి, ట్రస్ట్‌ గౌరవ సలహాదారులు వేముల సదానందం నేత, పద్మశాలి సంఘం నాయకులు వనం రవిందర్‌, అన్వేష్‌ తదితరులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా వన్నాల శ్రీరాములు మాట్లాడుతూ ప్రముఖ స్వా తంత్య్ర సమరయోధుడు, మాజీ మంత్రి ఆచార్య కొండా లక్ష్మణ్‌ బాపూజీకి తెలంగాణ జాతిపితగా గుర్తింపు కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. అలాగే బాపూజీ జీవిత చరిత్రను పాఠ్యపుస్తకాల్లో చేర్చాలని, భారత రత్న అవార్డు ప్రకటించాలని వన్నాల కోరారు. బాపూజీని జాతిపితగా సంబోధిస్తూ ప్రభుత్వానికి కళ్ళు తెరిపించాలని వన్నాల పిలుపు నిచ్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *