సమాజంలో మారిన సంసారబంధాలు
పూర్వకాలంలో సతీసహగమనం అనే ఆచారం ఉండేదని తెలిసే ఉంటుంది. సుమారు 15వ శతాబ్దంలో ఈ సంప్రదాయం కొనసాగినట్లు చరిత్ర వెల్లడిస్తోంది. భర్త చనిపోయిన తర్వాత భార్యను కూడా భర్త చితి మంటల్లో ఆహుతి కావడం ఈ ఆచారం. రాజారామ్మోహన్ రాయ్ వంటి కొందరు సంఘ సంస్కర్తలు వ్యతిరేకించగా, ఆ తర్వాతి కాలంలో ఈ ఆచారాన్ని నిషేధిస్తూ వచ్చారు. ఈ ఆచారానికి ఇప్పటికీ 500 ఏళ్లు దాటింది. కాలం, సంవత్సరాలు గడిచిన కొద్దీ పరిస్థితులు మారిపోయాయి. అప్పుడు భార్యను చితిమంటల్లో ఆహుతి చేస్తే.. ఇప్పుడు భార్య భర్తను హతమార్చుతోంది. అందుకు గల కారణాలేమైనా సతీసహగమనం ఆచారం కాలగమనంలో కలిసిపోయిందనుకుంటే నేడు పతీమరణమృదంగం మారుమోగుతోంది. మరి అనాగరిక అకృత్యాలను అడ్డుకునే సంఘసంస్కర్తలు ఎవరో? – నమస్తే.