లేదంటే అక్టోబర్లోనే?
స్థానిక సంస్థల ఎన్నికలకు హైకోర్టు మూడు నెలల గడువు ఇచ్చింది. అంటే సెప్టెంబర్ 30 లోపు ఎన్నికలు నిర్వహించాలని తేల్చిచెప్పింది. అయితే, పండుగలు.. పబ్బాలు పరిగణనలోకి తీసుకుంటే.. సెప్టెంబర్ 22లోపే ఎన్నికలు ముగించాల్సి ఉంటుందేమో! సెప్టెంబర్ 22 నుంచి 30వ తేదీ వరకు తెలంగాణలో అతిపెద్ద సంబురమైన బతుకమ్మ ఉత్సవాలు జరగనున్నాయి. అంటే జూలై చివరి వారమే ఎన్నికల నోటిఫికేషన్ జారీ కావాల్సి ఉంటుంది. ఒకవేళ కోర్టు గడువునే లెక్కలోకి తీసుకుంటే పోటీదారులకు పండగ ముందర సాదర ఖర్చులు తడిసిమోపెడు కావడం ఖాయం. లేదంటే అక్టోబర్లో నిర్వహించేందుకు ప్లాన్ చేసుకుంటుందేమో ప్రభుత్వం. – నమస్తే.