• లెక్క తేలదు.. తిప్పలు తప్పవు!
    అర్హులందరికీ పథకాలు.. ఇదీ సర్కారు వారి మాట. ఇంతకు ఎంతమంది అర్హులున్నారో ఎప్పటికీ తేలని సంఖ్య. ఏ పథకం.. ఎప్పుడు ప్రవేశపెట్టినా ప్రజలు క్యూ కడుతూనే ఉన్నారు. నిరుపేదల సంక్షేమమే ధ్యేయమంటారు.. మరి నిరుపేదల సంఖ్య తేల్చడంలో పాలకులు సాహసించరు. జనాభా గణన, కులగణన లెక్కలు వేసే ప్రభుత్వాలు.. అసలు దేశంలో ధనికులెందరు? నిరుపేదలు ఎందరు? అనే గణాంకాలు వేయడం మంచిదేమో? అప్పుడే ప్రభుత్వ పథకాలు ఎంతమందికి ఇవ్వాల్సి ఉంటుందో అర్థమవుతుంది. అందుకు ఎంత సొమ్ము ఖర్చు అవుతుందో స్పష్టమవుతుంది. బడ్జెట్‌లో ఎంత కేటాయించాలో తేలిపోతుంది. లేకపోతే.. ఇంటికో పథకం ప్రవేశపెట్టాల్సి వస్తుంది. బడ్జెట్‌ మొత్తం పథకాలకే పెట్టాల్సి వస్తుంది.