77 ఏళ్ల స్వతంత్ర భారతంలో కూడు, గూడు, గుడ్డకు తప్పని తండ్లాట!
భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చి 77ఏళ్లు గడిచిపోయింది. మరో రెండు నెలలు గడిస్తే 78 ఏళ్లు నిండుకుంటాయి. అయినా నేటికీ ప్రజల్లో చాలామంది తిండికి తిప్పలు పడుతూనే ఉన్నారు. ఉండడానికి నిల్వ నీడ కోసం తాపత్రయం తప్పడం లేదు. కట్టుబట్టలతోనే జీవనం సాగించే వారు లేకపోలేదు. ఐదేళ్లకు, పదేళ్లకోసారి పాలకులు మారుతున్నా.. మానవ జీవన ప్రమాణాలు మాత్రం మెరుగుపడడం లేదు. ప్రతీ ప్రభుత్వం కూడు, గూడు, గుడ్డ నినాదానికి పల్లకీ మోస్తున్నా అసలు లక్ష్యం.. గమ్యం చేరడం లేదు. పాలకుల తప్పిదమో.. వారిని ఎన్నుకోవడంలో ప్రజల పొరపాటో గానీ.. ఇబ్బందులు పడుతున్నది మాత్రం తామేనని ప్రజలు గుర్తించిన రోజునే సిద్ధించిన స్వాతంత్య్రానికి సరైన ఫలితం దక్కుతుంది. అప్పటివరకు కూడు, గూడు, గుడ్డ గోడు వినపడుతూనే ఉంటుంది. – నమస్తే.