• కనిపించకున్నా భక్తి..
    కనిపిస్తే భయం!
  • పాముల పూజలో పడతుల పారవశ్యం!
    పాము కనిపిస్తే చాలామంది భయపడుతుంటారు. మహిళలైతే హడలెత్తిపోతారు. కళ్ల ముందు నుంచి వాటిని పారదోలడమో లేదా చంపడమో చేసేంతవరకు గాబరపడుతుంటారు. అదే పండగ నాడు మాత్రం కనిపించని పాములకు పూలు, పాలు, పండ్లు, రకరకాల భక్తి రసాలు బహిర్గతమవుతాయి. నాగుల పంచమి, నాగుల చవితి రోజుల్లో తమ పొట్టలను ఎండబెట్టుకుని(ఉపవాసం).. పుట్టల వద్ద బారులుతీరుతారు. భక్తి పారవశ్యంలో మునిగిపోతారు. కొమ్ము చెక్కితే బొమ్మ.. కొలిచి మొక్కితే అమ్మ అన్నట్లుగా పాము పుట్టలో ఉంటే భక్తి.. ఇళ్లలో ఉంటే భయం! పండుగల రోజున పరవశం!! ఇదీ ఆచారం.. ఆచరిస్తున్న సాంప్రదాయం.
    – నమస్తే.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *