
కార్లలో కాపురం!
సిమెంటే భోజనమా!!
జీఎస్టీ ధరలతో ఎవరికి లాభం!
అంకెల గారడీ తప్ప పేదలకు మిగిలేదేంటీ?
జీఎస్టీ సంస్కరణలో, సవరణలో.. భారీగా రేట్లు తగ్గుతున్నాయని అటు కేంద్ర ప్రభుత్వం.. ఇటు పలు పత్రికలు, మీడియా గగ్గోలు పెడుతున్నాయి. కార్ల ధరలు లక్షల్లో తగ్గాయని, సిమెంట్ ధరలు కూడా దిగొచ్చాయని.. పట్టికలు వేసి మరీ ప్రచురించారు. ఒక సామాన్య రైతు కూలీ.. 7లక్షలు తగ్గాయని కారు కొనుక్కొని అందులో కాపురం చేస్తాడా? రూ.25లకు కిలో చొప్పున బ్లాక్ అమ్మే రేషన్ బియ్యం వదిలి.. ధర తగ్గిందని సిమెంట్ కొనుక్కుని బుక్కాలా? దేనికి సంస్కరణలు, ఎవరి కోసం సంస్కరణలు. పది రూపాయల పేస్ట్ మీద ఎంత ధర తగ్గుతుందో చెప్పగలరా? 130 రూపాయలు ఉన్న పల్లి నూనె ధర ఎంత తగ్గుతుందో తమ పత్రికల్లో ప్రచురించగలరా? పది రూపాయల సంతూర్ సబ్బు ఎంతకు దొరుకుతుందో మీడియా సూచించగలదా? జీఎస్టీ సవరణలు ఎవరికి లాభం.. లక్షల్లో సంపాదించే వారికి కార్ల కొనుగోళ్లలో మిగులుబాటు కోసం.. తప్ప.. వారానికో సబ్బు కొనుక్కునే పేదోడికి ఏం లాభం? పత్రికలు, మీడియా.. కేంద్ర ప్రభుత్వమే చెప్పాలి.
– జి.నమస్తే
