ఆ ఊళ్లో దేవుళ్ల పండుగ! విగ్రహ ప్రతిష్ఠోత్సవాలకు ముస్తాబవుతున్న బొడ్డుచింతలపల్లి జూన్ 6 నుంచి 8వ తేదీ వరకు జరగనున్న ఉత్సవాలు
ఊరంతా పండుగ చేసుకునే సందర్భాలు కొన్ని ఉంటాయి. అందులో విగ్రహ ప్రతిష్ఠోత్సవాలు ఒకటి. వరంగల్ జిల్లా గీసుకొండ మండలం బొడ్డుచింతలపల్లి గ్రామం అందుకు ముస్తాబవుతోంది. కాకతీయుల కళా వైభవానికి తార్కాణంగా నిలిచేలా నిర్మించిన శివాంజనేయ, చెన్నకేశవ, వీరభద్ర, సీతారామ స్వామి ఆలయాల్లో విగ్రహ ప్రతిష్ఠను జూన్ 8న నిర్వహించేందుకు వేద పండితులు ముహూర్తం నిర్ణయించారు. ఇందులో భాగంగా జూన్ 6వ తేదీ నుంచి వివిధ పూజలు, హోమమలు నిర్వహించనున్నారు. ఈ మహోన్నత దైవ కార్యాలకు స్థానికులతోపాటు వివిధ ప్రాంతాల్లో నివసిస్తున్న బొడ్డుచింతలపల్లి వాస్తవ్యులు విధిగా హాజరై దేవతామూర్తుల అనుగ్రహం పొందాలని ఆలయ కమిటీ సభ్యులు ఆకాంక్షిస్తూ ఆహ్వానిస్తున్నారు. మరిన్ని వివరాలకు 8008200850 నంబర్లో సంప్రదించవచ్చని సూచించారు.