
యూట్యూబ్ శిష్యులు!!
రకరకాల సమాచారంతో వీడియోలు
దొంగతనాలకు సంబంధించిన చిత్రాలు సైతం
ఇదీ కలియుగంలో కొత్త తరహా విద్యాభ్యాసం
ఏకలవ్యుడు పేరు అందరూ వినే ఉంటారు. ద్రోణాచార్యుడి విగ్రహాన్ని ఆరాధించి విలువిద్యలో ఆరితేరినట్లు ప్రచారంలో ఉంది. ఇది పూర్వకాలం గాథ. ఇదిలా ఉండగా, ప్రస్తుత కలియుగంలోనూ ఏకలవ్య లాంటి శిష్యులు అనేకం ఉన్నారు. కానీ.. ద్రోణాచార్యుడి పాత్ర సెల్‌ఫోన్లు పోషిస్తున్నాయి. యూట్యూబ్‌లో ఏ విషయానికి సంబంధించిన సమాచారమైనా వీడియోల రూపంలో అందుబాటులో ఉంటోంది. చదువులు, వంటకాలు, వివిధ రకాల పరికరాలు పనితీరు.. రిపేరింగ్, డెకరేటివ్ వస్తువుల తయారీ ఒకటేమిటీ ఏదీ కావాలన్న.. చిటికెలో సెల్‌ఫోన్ స్క్రీన్‌పై సాక్షాత్కరిస్తోంది. అంతేకాదు, దొంగతనాలు ఎలా చేయాలి? ఇతరులను ఎలా మోసం చేయాలనే శిక్షణ తరగతులు కూడా ప్రసారమవుతున్నాయి. ఇలా యూట్యూబ్‌లో చూసి.. హత్యలు, చోరీలు చేసిన సంఘటనలు కూడా ఉన్నాయి. నాడు ఎంతో గురుభక్తితో ఏకలవ్యుడు పట్టుదలతో తపస్సు ఆచరించి.. దైవాజ్ఞతో విలువిద్యను అభ్యసిస్తే.. నేడు సోషల్‌మీడియా పుణ్యమా అని.. ఎందరో ఏకలవ్యులు తయారవుతున్నారు. శాస్త్ర సాంకేతికతలో సాధిస్తున్న పురోగమనం.. అభివృద్ధి మాట అటుంచి సమాజంపై దుష్ప్రభావం పడుతోంది. చట్టాలు, పోలీస్ చర్యలు ఎన్ని ఉన్నా… యూట్యూబ్‌లో సంఘవిద్రోహక చర్యల సమాచారం అరికట్టలేకపోవడం విచారకరం.. ఆందోళనకం..!
-జి.ఎన్.అయ్యగారు
