
మహిళలకు ఉచితంగా బస్సు ప్రయాణం కల్పిస్తున్న ప్రభుత్వం ఆర్టీసీ చార్జీలను అమాంతం అడ్డగోలుగా పెంచింది. తాజాగా ప్రభుత్వం ఇందిరమ్మ పేరిట మహిళలకు చీరలు పంపిణీకి శ్రీకారం చుట్టింది. ఈ క్రమంలో ప్రభుత్వం వేటి చార్జీలు పెంచుతుందో అని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఇంకా ప్రభుత్వం ఇచ్చిన హామీల్లో మహిళలకు రూ. 2500 , ఆసరా పింఛన్లు రూ. 4 వేలకు పెంచి అందించాల్సి ఉంది. ఒకవేళ వాటిని కూడా అమలు చేస్తే అందుకు బదులుగా వేటి చార్జీలు పెంచుతుందో అనే ఆలోచనలో ప్రజలు ఉన్నారు. విద్యార్థులకు నిరుద్యోగ భృతి కూడా అందిస్తే ఇంకా వేటి ధరలు పెరుగుతాయోనని ప్రజలు కంగారు పడుతున్నారు. ఏం జరిగినా చూస్తూ ఊరుకోవడం తప్ప ప్రజలు చేసేదేముంది. ఓట్లు అమ్ముకునే వారు ఎవరినని ప్రశ్నించగలరు.
