• పొలిటికల్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్
  • నేడో, రేపో విడుదలకు సన్నాహాలు
    పదో తరగతి పాసైన వారికీ మంచి ఉద్యోగావకాశాలు. అది కూడా సొంత ఊళ్ళోనే. ఒకటి రెండు రోజుల్లో నోటిఫికేషన్ కూడా జారీ కానుంది. వార్డ్ మెంబెర్ నుంచి జిల్లా పరిషద్ చైర్మన్ వరకు అన్ని పోస్టుల భర్తీకి ప్రభుత్వంతో పాటు ఎన్నికల సంఘం సన్నద్ధమవుతోంది. తెలంగాణ వ్యాప్తంగా లక్షకు పైగా వార్డు మెంబర్లు, 12 , 500 సర్పంచ్, 560 ఎంపీటీసీలు, ౩౩ జడ్పీ ఛైర్మెన్ పోస్టులు భర్తీ కానున్నాయి. ఈ మేరకు అర్హులైన నిరుద్యోగులు ఆయా పోస్టులకు పోటీ పడొచ్చు. ఒక్కో అభ్యర్థి ఒకేసారి అన్ని పోస్టులకు కూడా పోటీ చేసే అవకాశాము కూడా ఉంది. పోటీ రుసుముగా 5 వేల రూపాయల నుంచి 10 వేల వరకు ఉంటుందని అంచనా. విజేతలకు నెల వారీగా గౌరవ బత్తెం తో పాటు సంఘంలో మర్యాద, పోలీసు స్టేషన్లలో తగిన గౌరవం దక్కుతాయి. అయిదేళ్ల పాటు ఉండే ఈ ఉద్యోగం తర్వాత కొన్ని పోస్టుల్లో పనిచేసిన వారికీ పెన్షన్ కూడా వస్తుంది. ఈ అవకాశాన్ని యువత వినియోగించుకుంటుందా లేదా వేచి చూద్దాం!