కొనేందుకు కోట్లతో పలువురు సిద్ధం
పల్లెటూళ్ళు అమ్మకానికి రెడీగా ఉన్నాయి. కొనేందుకు కూడా కొందరు కోట్లు చేతిలో పెట్టుకొని బేరసారాలకు సిద్ధంగా ఉన్నారు. ఒకటి రెండు రోజుల్లో స్థానిక సంస్థల ఎన్నికలకు నోటిఫికేషన్ రాగానే తమ ప్రయత్నాలను ముమ్మరం చేయనున్నారు. మరో పక్క ఏకగ్రీవ పంచాయతీలకు ప్రభుత్వం పది లక్షల నజరానా ప్రకటించింది. దీంతో రాజకీయాలపై మక్కువ ఉంది, చేతి నిండా డబ్బులు ఉన్నవారు ఏకగ్రీవంగా సర్పంచులుగా ఎన్నిక కావాలనే కుతూహలంతో ఉన్నారు. కొందరు కోట్లు ఇస్తామని, అందుకు అగ్రిమెంట్ కూడా రాసేందుకు కూడా రెడీగా ఉన్నారు. ఇక కొన్ని గ్రామాల్లో సర్పంచ్ కుర్చీ కోసం వేలం పాటలు కూడా నిర్వహించే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. మొత్తంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో కోట్లాది రూపాయలు రాజకీయాలను శాసించనున్నాయి.