• సెక్యూరిటీ ఏజెన్సీల దోపిడీ !
  • ప్రైవేట్ కంపెనీలకు వేల సంఖ్యలో సెక్యూరిటీగా ఉద్యోగాలు
  • ఏజెన్సీల తరపున నియామకం
  • వేతనాల్లో కోతలు, కమీషన్ల కింద జమ
  • కనీస సౌకర్యాలు కరువు, పైగా వేధింపులు
  • పట్టించుకోని ఏజెన్సీలు
    పలు ప్రైవేట్ కంపెనీలు, కొన్ని ప్రభుత్వ కార్యాలయాలు, మల్టీ ప్లెక్సు కాంప్లెక్సులు, పెద్ద పెద్ద షాపింగ్ కాంప్లెక్సుల వద్ద సెక్యూరిటీ సిబ్బందిని చూసే ఉంటాం. పార్కింగ్ ఏరియాల్లో వాహనాలను వరుస క్రమంలో పెట్టించడం, అవసరమైతే వాహనాలను పార్కింగ్ చేయడం, కొనుగోలుదారులు, సందర్శకులను తనిఖీ చేయడం లాంటి విధులు నిర్వహిస్తుంటారు. అయితే ఈ సెక్యూరిటీ గార్డులను ఎక్కువ శాతం కొన్ని ఏజెన్సీలు నియమిస్తుంటాయి. ఇందుకు ఒక్కో సెక్యూరిటీ గార్డుకు ఒక్కో సంస్థ నుంచి నెల వేతనంగా 20 వేల నుంచి 25 వేల వరకు ఏజెన్సీలకు చెల్లిస్తుంటాయని సమాచారం. ఏజెన్సీలు మాత్రం ఒక్కొక్కరికి 15 వేల నుంచి 20 వేల లోపే చెల్లిస్తున్నట్లు తెలుస్తోంది. పైగా అందులోనే పిఎఫ్, ఈఎస్ఐ కింద వెయ్యి నుంచి 1500 వరకు కోత విధిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక వీరికి సెలవులు దొరకడం కష్టం. వారిలో వారే సర్దుకు పోవాల్సిందే. ఇక వీరు పనిచేసే చోట కొన్ని సంస్థలు కనీస వసతులు కూడా కల్పించడం లేదని సమాచారం. మరుగుదొడ్లు, మంచినీటి వసతి కూడా ఉండవని తెలుస్తోంది. వీరి బాధలను చెప్పుకున్న ఏజెన్సీ వారు పట్టించుకునే పరిస్థితి లేదని పలువురు సెక్యూరిటీ సిబ్బంది వాపోతున్నారు. ఈ ఏజెన్సీల పై ఎవరి అజమాయిషీ ఉంటుందో గాని వీరి దోపిడీకి అడ్డుకట్ట వేసే వారే లేరా అని సెక్యూరిటీ సిబ్బంది ఆవేదన చెందుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *